మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

4892చూసినవారు
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న కబ్బాలి వేదవతి ఆదివారం సాయంత్రం గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బింగానిపల్లె చెందిన వేదవతి 2016 లో పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కానిస్టేబుల్ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకునే క్రమంలో అక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మదనపల్లెకు చెందిన దస్తగిరితో ప్రేమలో పడి 2016లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం 2017లో వేదవతికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దీంతో వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సంవత్సరం క్రితం బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం రాయచోటి పట్టణం లోని రాజీవ్ స్వగృహ పక్కన గల ఇందిరమ్మ కాలనీలో భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్