అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్థానిక వినాయక వీధిలో గత కొన్ని నెలల నుంచి వెలుగిల్లు నీళ్లు వదిలిన ప్రతిసారి వీధిలో రోడ్డుపైన నీరు వృధాగా వెళుతున్నాయని వీధిలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాయచోటి మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.