కూటమి నాయకుల సంబరాలు

54చూసినవారు
సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో బురకాయలకోటలో శుక్రవారం కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ ఆధ్వర్యంలో ములకలచెరువు నుంచి బురకాయలకోట వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. పెద్దఎత్తున బాణాసంచా పేల్చారు. జై బాబు. జైపవన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. BJP నాయకుడు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్