తంబళ్లపల్లె: తుఫాను ఎఫెక్ట్.. నేలవాలిన పంటలు

54చూసినవారు
తుఫాను ప్రభావంతో మండలంలో 3రోజులుగా ముసురుకున్న వానకు పలుపంటలు నేలవాలి రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలో 590ఎకరాల్లో వరి పంట సాగవగా 80% వరకూ కోతలు పూర్తయ్యాయి. కోతదశలో వరి చాలావరకు తుఫానుదాటికి నేలవాలింది. తంబళ్లపల్లెలో ఓ రైతుకు చెందిన 3ఎకరాల మొక్కజొన్న పంట నేలవాలి దెబ్బతింది. తమను ఆదుకోవాలని స్థానిక రైతులు సోమవారం ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్