పెరుగు నిల్వ చేసేందుకు రాగి పాత్రలు వాడొద్దు. తాజా అధ్యయనాల్లో రాగి పాత్రలలో పెరుగు ఉంచితే లాక్టిక్ యాసిడ్‌కి రాగి ప్రతిచర్యతో విషపూరిత పదార్థాలు ఉత్పత్తి అవుతాయని తేలింది. ఇవి జీర్ణ సమస్యలు, గ్యాస్, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయట. గాజు, సిరామిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు పెరుగు నిల్వకు మంచివిగా పరిగణించబడుతున్నాయి. శరీరాన్ని రక్షించుకోవాలంటే రాగి పాత్రల్లో పెరుగు నిల్వ చేయకూడదు.