AP: డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు నిర్వహించనున్నారు. ఈ పెట్రోల్ బంకులకు అయ్యే ఖర్చును డ్వాక్రా సంఘాల పొదుపు డబ్బుల నుంచి తీసుకుంటారు. రూ.6 వేల కోట్ల పొదుపు డబ్బులను ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తోంది.