కలబంద గుజ్జు లేదా జ్యూస్‌ను నేరుగా అలాగే తీసుకోవచ్చు. అయితే కలబంద రుచి కొందరికి నచ్చకపోవచ్చు. ఇది కొందరికి చేదుగా, వగరుగా అనిపిస్తుంది. కనుక అలాంటి వారు తేనెను చేర్చి తీసుకోవచ్చు. అయితే కలబందను అలర్జీలు ఉన్నవారు తీసుకోకూడదు. కలబందను తింటే కొందరికి పడదు. దీంతో వారికి చర్మంపై దురదలు వస్తాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.