కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనిక పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీష్ కమీషనర్ కు మోహన్ బాబు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తనకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని ఉందని.. రక్షణ కావాలని మోహన్ బాబు లేఖలో కోరినట్లు సమాచారం. తాజాగా మంచు మనోజ్ సైతం పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.