ఉచితాలు ఇంకెంత కాలం?: సుప్రీంకోర్టు

66చూసినవారు
ఉచితాలు ఇంకెంత కాలం?: సుప్రీంకోర్టు
ఉచితాలు ఇంకెంత కాలం కొనసాగిస్తారని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 81 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇస్తున్నామని కేంద్రం చెప్పడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేవలం పన్ను చెల్లింపుదారులే మిగిలి ఉన్నారని పేర్కొంది. వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడం, సామర్థ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్