కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ శనివారం ఉదయం 5:30 గంటలకు గ్రామ పంచాయితీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, కార్యదర్శి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 4000 నగదు అందించారు. ఆదివారం సెలవు ఉండటంతో ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేశామన్నారు. 100% పంపిణీ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.