మేదరమెట్ల: ప్రభుత్వ బాలుర వసతిగృహం తనిఖీ

51చూసినవారు
మేదరమెట్ల: ప్రభుత్వ బాలుర వసతిగృహం తనిఖీ
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సోమవారం సాయంత్రం మండల తహశీల్దార్ జీ. వి సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులతో మాట్లాడి వారికి అందిస్తున్న సదుపాయాలు, రోజువారి భోజన మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిసరాలను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్. ఐ కృష్ణమోహన్, వీఆర్వో, వార్డెన్ సుమలత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్