స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల సూర్యలంక బీచ్ వద్ద బుధవారం ముగింపు కార్యక్రమం సందర్భంగా పారిశుధ్య కార్మికులను కలెక్టర్ వెంకట మురళి సన్మానించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు సూర్యలంక బీచ్ లో పారిశుద్ధ్యం మెరుగుపరిచిన కార్మికులను ఈ సందర్భంగా సన్మానించారు. పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన సూచించారు. కమిషనర్ నిర్మల్ కుమార్, కార్యదర్శి శరత్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.