చిలకలూరిపేట ఎన్ఆర్టీ రోడ్డులో మాజీ మంత్రి ఇంటి నిర్మాణం కోసం డ్రైన్ల స్వరూపాన్నే మార్చివేశారని, ఇందువల్ల పలు కాలనీలలో ముంపు సమస్య ఏర్పడిందని మున్సిపల్ టీడీపీ పక్ష నాయకుడు శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం చిలకలూరిపేట మునిసిపల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి నిర్మాణం కోసం డ్రైన్లను తొలగించారని, పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.