కటారివారిపాలెం సమీపంలో ఇటీవల తనకు చెందిన విల్లాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యర్రవరపు కళ్యాణ్ కుటుంబానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ కుటుంబానికి ఆయన 50వేల రూపాయలు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఆయా కుటుంబాలకు తాను అండగా ఉంటానని ఆమంచి భరోసా ఇచ్చారు.