ఎస్సీ, ఎస్టీ కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని, ముఖ్యంగా వారికి స్మశాన సౌకర్యం కల్పిస్తామని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చెప్పారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు మేలు చేయడానికే చట్టాలు ఉన్నాయని చెప్పారు. అధికారులు కూడా బాధితుల పక్షాన నిలిచి వారికి తక్షణ న్యాయం చేయాలన్నారు.