చీరాల న్యాయస్థానంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 1249 కేసులు పరిష్కారమయినట్లు సీనియర్ సివిల్ జడ్జి ఎం. సుధ చెప్పారు. రికార్డు స్థాయిలో 1226 క్రిమినల్ కేసుల్లో ఇరువర్గాలు రాజీ పడ్డాయని ఆమె వివరించారు. అలాగే సివిల్ కేసులు 14, చెక్ బౌన్స్ కేసులు7, భరణం కేసులు రెండు కూడా పరిష్కారమైనట్లు ఆమె వెల్లడించారు. న్యాయాధికారులు షేక్ రెహనా, నిషాద్, లోక్ అదాలత్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.