మద్దిరాలపాడు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైన.. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల, పర్చూరు శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య,ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలుసుకోగా ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఊరూరా నిర్వహించి జయప్రదం చేయాలని సీఎం వారికి సూచించారు.