స్కీం వర్కర్లకి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షలు ఎం. వసంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం సిఐటియు చీరాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. సిఐటియు అధ్యక్షుడు ఎన్. బాబురావు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. వర్తమాన పరిస్థితులు, కార్మికుల కర్తవ్యాలు అనే అంశంపై చర్చ జరిగింది. కార్మికులకు సిఐటియు ఎప్పుడూ అండగా ఉంటుందని నేతలు చెప్పారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.