ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ జీవో నెం: 36 ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 కి పెంచాలని, వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘ ఉద్యోగులకు పెన్షన్ బెన్ఫిట్ లేని కారణంగా గ్యాడ్యుటీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పెంచాలన్నారు.