గుంటూరు: భార్యని చూడటానికి వస్తూ భర్త మృతి

59చూసినవారు
గుంటూరు: భార్యని చూడటానికి వస్తూ భర్త మృతి
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న భార్యని చూడటానికి వస్తున్న భర్తను బుధవారం మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనం పై వస్తున్న వ్యక్తి పేరేచర్ల వద్ద వాహనం అదుపు తప్పడంతో బ్రిడ్జి పై నుండి ఎగిరి పడి దుర్మరణం చెందాడు, స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మేడికొండూరు పోలీసులు మృతుడు నాన్నం విజయకుమార్ 35 సంక్రాంతిపాడు గ్రామస్తుడిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్