సత్తెనపల్లి పరిధిలో 15 మద్యం దుకాణాలకు అనుమతి

70చూసినవారు
సత్తెనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 15 మద్యం ప్రైవేటు దుకాణాలకు అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని ఎక్సైజ్ సీఐ విజయకుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 6, రూరల్ పరిధిలో 5, ముప్పాళ్ళ 2, రాజుపాలెం 2, దుకాణాలకు వార్షిక లైసెన్స్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అక్టోబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్