గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారని జిల్లా కార్యదర్శి శివ శంకర్ శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్ లో పోటీలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన జట్లను విశాఖపట్నం జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు.