ఆంధ్రప్రదేశ్లో రూ. 20 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఏపీ సమగ్రాభివృద్ది అధ్యయన వేదిక కన్వీనర్ టీ. లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు నగరంలోని జనచైతన్య కార్యాలయంలో చర్చా గోష్టి జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్నారు గాని నిధులను విడుదల చెయ్యట్లేదన్నారు. లక్ష్మన్ రెడ్డి, డొక్కా, సుబ్రహ్మణ్యం, కృష్ణ మూర్తి, పటేల్ ప్రసంగించారు.