కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో శనివారం జంగాల మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఉన్నప్పుడే తేలిపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు మాల్యాద్రి, అరుణ్, హనుమంతరావు పాల్గొన్నారు.