దాచేపల్లిలోని నార్కెట్ పల్లి హైవేపై సాక్షి పేపర్లను జనసేన నేతలు ఆదివారం దగ్ధం చేశారు. అనంతరం జనసేన నేత తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ సాక్షి పేపర్లో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ పై తప్పుడు కథనాలు రాయడం ఆపాలని లేదంటే సాక్షి ఆఫీస్ లేకుండా చేస్తామని వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత అధికారంలో లేనప్పుడే ఎంతోమంది రైతులకు తన సొంత నిధులు ఆర్థిక సహాయం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.