పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీను విరాళాలు అందజేస్తున్న దాతలకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. శుక్రవారం పిడుగురాళ్లకు చెందిన యక్కల భాస్కరరావు, కట్టమూరి శంకర్ రావు , ఏలూరి చంద్రశేఖర్ లు అన్న క్యాంటీన్ కు రూ. 2 లక్షల చెక్కులను ఎమ్మెల్యే యరపతినేనికి అందజేశారు. దాతలు ఎవరైనా అన్న క్యాంటీన్ నిర్వహణకు సహాయ సహకారాలు అందించవచ్చన్నారు.