ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టివేత
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం పొందుగుల ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని దాచేపల్లి పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి వద్ద ఉన్న రూ. లక్ష విలువ చేసే రెండు కిలోల గంజాయిని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.