ప్రకాశం: పాడుపని చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మరిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామ సమీపంలోని పొలాలలో శనివారం పేకాట ఆడుతున్న 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 6, 910. నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని మర్రిపూడి పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టారీత్యా నేరమని ప్రజలను పోలీసులు హెచ్చరించారు.