స్నానం చేసేందుకు కుడి కాలువలో దిగిన యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం మాచర్ల పట్టణ శివారులోని కుడి కాలువ వద్ద జరిగింది. ఈపూరు మండల పరిధిలోని కొండ్రుముట్ల శివారులోని దిస్మాన్ పేటకు చెందిన రమావత్ అశోక్ కుటుంబ సభ్యులతో కలిసి మాచర్ల వచ్చాడు. వినాయకుడి గుట్టలోని ఓ చర్చిలో ప్రార్థనలు ముగించుకొని స్నానం చేసేందుకు కుడి కాలువలో దిగాడు. నీటి ప్రవాహానికి యువకుడు గల్లంతయ్యాడు. గాలింపులు చర్యలు చేపట్టారు.