విద్యుత్ చౌర్యం నేరమని, అధిక లోడ్లు వేయటం, అధికంగా విద్యుత్ వాడి బిల్లులు సకాలంలో కట్టకపోవడం చట్టరీత్యా నేరమని జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ విజయ కుమార్ అన్నారు. మాచర్ల రూరల్ సెక్షన్ లో రాయవరం, కొత్తూరు, కొత్తపల్లి తదితర గ్రామాల్లో శనివారం ఆయన విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 6 మందికి రూ. 2. 20లక్షలు జరిమానా విధించినట్లు చెప్పారు.