పిడుగురాళ్ల - మాచర్ల మధ్యలో నిర్మిస్తున్న హైవే నిర్మాణ పనులను శనివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పరిశీలించారు. రహదారి నిర్మాణ నాణ్యతలో రాజీ లేకుండా ఎటువంటి లోపాలు లేకుండా నిర్మాణాలు జరగాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. త్వరితగతిన రహదారి నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.