మాచర్ల మండలంలోని కొప్పునూరు, అనుపు ఫీడర్లలోని 33 కేవీ పరిధిలోని గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫ రాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏపీఎస్పీ డీసీఎల్ మాచర్ల డీఈ రామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫీడర్స్ పరి ధిలోని లైన్ మెయింటెనెన్స్, రోడ్డు వైడెనింగ్ వర్క్ స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డుతుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.