మంత్రి లోకేష్ ని కలిసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు

81చూసినవారు
మంత్రి లోకేష్ ని కలిసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
విద్యారంగ పరిరక్షణ కోసం జీవో నంబర్ 117ను వెంటనే రద్దు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఐ. వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియను నిలిపివేయాలని సూచించారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఉపాధ్యాయులపై పని భారాన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్