మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజా వేదిక మూడు రోజులు రద్దు అయినట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు గురువారం తెలిపారు. సీఎం, మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజా వేదిక మూడు రోజులు ఉండదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు, ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.