జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నరసరావుపేట ఆసుపత్రిని పరిశీలించారు. మెమోరాండం హాస్పటల్ డిప్యూటీ డిఎం. హెచ్వోకి అందజేశారు. తదుపరి పిడిఎం సీనియర్ నాయకులు వై. వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఐసీయూ, సరైన మందులు లేక గుంటూరు జి. జి. హెచ్ కి రిఫరల్ చేస్తున్నారని ఆరోపించారు.