కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడాన్ని మించిన సేవ ఏముంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. కృష్ణా వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలోని 40వ డివిజన్లో బుధవారం ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీలో పాల్గొన్నారు. ఇప్పటికే నరసరావుపేట నుండి తాగునీటి ట్యాంకర్లను పంపించిన అరవిందబాబు, నేడు తానే స్వయంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.