ఆదివాసీల ఉద్యమాలకు సంఘీభావంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడ హనుమంతురాయ గ్రంథాలయంలో ఈనెల 10న జరుగు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రల సదస్సును జయప్రదం చేయాలని పిడిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నరసరావుపేట బస్టాండ్ సెంటర్ లో సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. విజయవాడలో సదస్సు జరుగుతుందని ప్రజలందరూ పాల్గొని ఆదివాసి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించాలని కోరారు.