దేశభద్రత, సమాజ రక్షణ కోసం అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరిచిపోలేనివని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం నరసరావుపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు పోరాడి అమరులైన పోలీసుల త్యాగనిరతికి క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.