నరసరావుపేట పట్టణం ప్రకాశ్ నగర్లోని ఈద్గా మైదానాన్ని సోమవారం టీడీపీ నాయకులు పరిశీలించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జరిగే ప్రార్థనలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లలను వారు పరిశీలించారు. ప్రతి రంజాన్ పర్వదినాన పట్టణ, పరిసర ప్రాంతాల్లోని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందని నాయకులు బ్రహ్మయ్య తెలిపారు. మంచినీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.