రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణకై జరుగుతున్న దీక్షల్లో భాగంగా.. మంగళవారం నరసరావుపేట గాంధీ పార్క్ నందు యువజన, విద్యార్థి సంఘాల నాయకులు దీక్షలు చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 1325 రోజులుగా పోరాటం జరుగుతుందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరానికి ప్రతీకగావున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని విమర్శించారు.