ఇంకొల్లు పోలీస్ స్టేషన్ లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్సై సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ఎందరో వీరుల త్యాగనిరతి ఫలితంగా లభించిన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కోరారు. స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తే అడ్డుకోవడానికి చట్టాలున్నాయన్నారు. స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.