అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో అప్పల పాలై మనోవ్యధతో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన అమరావతి మండలంలోని మునగోడులో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ధరణికోట శ్రీను (40) రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టం వాటిల్లింది. దీంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక పురుగు మందుతాగి మృతి చెందారు.