వల్లూరు గంగాధరరావు సేవలు చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శనివారo పెదకాకాని గ్రామంలో వల్లూరు గంగాధర్ రావు 18వ వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. 1959, 1970 సం. రాలలో రెండు పర్యాయాలు పెదకాకాని సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ మిల్లుల ప్రధాన కార్యదర్శిగా కార్మికుల కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు.