ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. భట్టిప్రోలు నుండి చెరుకుపల్లి వైపు వస్తున్న బైకు చెరుకుపల్లి నుండి కనకాల వైపు వెళ్తున్న బైకులు పొన్నపల్లి జాతీయ రహదారి వద్ద ఒకదానికొకటి ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులు రోడ్డుపై పడి తీవ్ర గాయాలు పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.