పెనుమూడి ప్రమాదంలో 3కు చేరిన మృతుల సంఖ్య

56చూసినవారు
పెనుమూడి ప్రమాదంలో 3కు చేరిన మృతుల సంఖ్య
రేపల్లె రూరల్ మండలం పెనుమూడి వారధి పై ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, టాటా ఎస్ వాహనం ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌజన్య (27) సోమవారం మృతి చెందారు. ప్రమాద ఘటనా స్థలంలోనే గంగాధర్, శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్