పేరేచర్ల: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో చందన

71చూసినవారు
పేరేచర్ల: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో చందన
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో తోట చందన స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడికొండూరు మండల పరిధిలోని 7907 ఉన్నాయని నేటితో మెజారిటీ పింఛన్ ల పంపిణీ పూర్తవుతుందని ఎంపీడీఓ చందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ పూర్ణ శంకరరావు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్