ఫిరంగిపురం: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి: సీఐ
ఫిరంగిపురం మండలంలోని రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సీఐ రవీంద్ర బాబు అన్నారు. మంగళవారం ఫిరంగిపురం మండలంలో ఆయన మాట్లాడుతూ గొడవల్లో, ఇతర అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలుంటాయని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. మండలంలోని రౌడీషీటర్లు పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు.