తెనాలి: సాధారణ పౌరుడిలా మంత్రి మనోహర్

78చూసినవారు
సాధారణ పౌరుడిలా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రవర్తించిన తీరు ప్రజలను ఆకర్షించింది. గురువారం సత్తెనపల్లిలో రైస్ మిల్లు తనిఖీల కోసం ఆయన వెళ్లారు. సత్తెనపల్లిలో రోడ్డు పక్కనే కారు ఆపించి అక్కడ ఉన్న ఓ బడ్డీ కొట్టు వద్ద టీ తాగటంతో ఆయన ప్రవర్తించిన తీరును చూసి ప్రజలు సంతోషించారు. అక్కడ సామాన్యులను పలకరించి నిత్యావసర ధరలపై ఆరా తీసి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్