78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగముగా మండల కేంద్రం కొల్లూరు లోని తల్లపనేని జయ లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమం గురువారం నిర్వహించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గోపాల కృష్ణ లక్ష్మీ కాంతం, వైస్ చైర్మన్ కొక్కిలిగడ్డ సునీలబాబు, ప్రధానోపాధ్యాయులు చావా ఉషా కుమారి లు పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.