వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి మైనర్ కాలవ మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ ఇటీవల ప్రజాసంఘాలు జిల్లా కలెక్టర్ కి అర్జీ ఇచ్చిన నేపథ్యంలో శనివారం స్థానిక అధికారులు కాలువను పరిశీలించారు. పూడిపోవటం వల్ల నీళ్లు పొలాలు మరియు ఇళ్ల మీద పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని కాలవ బాగు చేసి రవాణా మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు సమస్యపై సమగ్ర నివేదిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.